Home  »  TV News  »  Jayam serial : విశ్వపై రౌడీల దాడి.. ప్రాణాలు కాపాడి మాస్ ఎంట్రీ ఇచ్చిన రుద్ర!

Updated : May 20, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -273 లో.....విశ్వ వాళ్ళ ఇంటి దగ్గరికి సీతారాములు వస్తాడు. సుధాని కలిసి ఒకప్పుడు మీ దగ్గర పని చేసాను.. సర్ అర్జంట్ గా కలవమని చెప్పారని సీతారాములు అంటాడు. అప్పుడే విశ్వ వస్తాడు. పైకి వెళ్లి మాట్లాడుకుంటాం.. మమ్మల్ని డిస్టబ్ చేయకని సుధాతో విశ్వ అంటాడు. ఏం చేస్తున్నావ్ సుధా అని విశ్వ అడుగుతాడు. ఆవకాయ ఎలా పెట్టాలో వీడియోస్ చూస్తున్నానని సుధా అంటుంది.. కానీ పెద్దసారుతో వీడియో కాల్ లో ఉంటుంది. సీతారాములిని తీసుకొని విశ్వ పైకి వెళ్తాడు.

నేను నీకు ఇచ్చిన పాపని ఏం చేసావని అడుగుతాడు. అమ్మొడి ఆశ్రమంలో ఇచ్చేసానని అతను అంటాడు. దాంతో అతనికి కొంత డబ్బు ఇచ్చి విశ్వ పంపిస్తాడు. అవన్నీ మాటలు పైడిరాజు వింటాడు. పైడిరాజుని విశ్వ పిలిచి బయటకు వెళదామని చెప్తాడు. ఇప్పుడు అతను చెప్పిన అడ్రెస్ కి తీసుకొని వెళ్తాడేమోనని పైడిరాజు అనుకుంటాడు. మరొకవైపు ఆవకాయ పెట్టేది వీడియో కాల్ లో సుధా చూస్తుంది. అదే సమయంలో ఇషిక, వీరు వాళ్లంతా కలిసి ఆవకాయ పెట్టడం చూసి కుళ్ళకుంటారు. ఆ ఆవకాయని చెడగొట్టాలని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత పైడిరాజు విశ్వ వెళ్తుంటే ధీరజ్ తనని విశ్వ అవమానించాడని కొంతమంది రౌడీలని పెట్టి ఎటాక్ చేయిస్తాడు. విశ్వకి గాయాలు అవుతాయి. దాంతో రుద్రకి పైడిరాజు కాల్ చేసి చెప్తాడు. ఇక రుద్ర వచ్చి రౌడీలని కొట్టి విశ్వని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి ట్రీట్ మెంట్ చేయిస్తాడు.

ఆ తర్వాత విశ్వని తీసుకొని రుద్ర ఇంటికి వస్తాడు. ఏమైందని సుధా టెన్షన్ పడుతుంది. ఎవరో ఎటాక్ చేశారని విశ్వ అంటాడు. నేను బ్రతుకి ఉన్నానని తెలిసినవాళ్ళు నాపై ఎటాక్ చేశారని పెద్దసారుని ఉద్దేశ్శించి విశ్వ చెప్తాడు. నన్ను కాపాడినందుకు థాంక్స్ రుద్ర అని విశ్వ చెప్తాడు. రుద్ర వెళ్తుంటే అసలు ఎవరు చేశారని సుధా అడుగుతుంది. కనుక్కుంటా అత్తయ్య అని రుద్ర అంటాడు. మరొకవైపు ఆవకాయలో ఉప్పు ఎక్కువ వేసి చెడగొట్టాలని ఇషిక అనుకొని ఉప్పు వెయ్యబోతుంటే గంగ ఆపుతుంది. అప్పుడే అందరు వస్తారు. నిన్ను ఉప్పు ఎవరు కలపమన్నారని ఇషికని శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.